జగన్ కు పెద్ద పరీక్ష: ఉన్నది ఒకటి.. 13 మంది వెయిటింగ్ అక్కడ!

ఎమ్మెల్సీ కోటాలో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు.. రాజ్యసభకు ఎంపిక కావడంతో వారి కేబినెట్ బెర్తులు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా వైకాపాలో మళ్లీ మంత్రిపదవుల హడావిడి మొదలైపోయింది. జగన్ దృష్టిలో తామున్నామో లేదో అనే టెన్షన్ లో చాలా మంది నేతలు, మరి ముఖ్యంగా బలమైన ఆశావహులు తెగ టెన్షన్ పడిపోతున్నారంట. తమకు ఎలాగూ ఇప్పట్లో రాదని క్లారిటీతో ఉన్నవారు బాగానే ఉన్నారు కానీ.. తమకు అర్హత ఉంది అని ఫీలవుతున్నవారు మాత్రం కంటిమీద కునుకు లేకుండా ఆలోచిస్తున్నారని అంటున్నారు.

ఈ క్రమంలో జిల్లాకు రెండేసి కేబినెట్ పోస్టులు వచ్చిన ప్రాంతంలోని నేతలు కాస్త గమ్మునున్నా… ఒక్కొక్క మంత్రి పదవిని మాత్రమే పొందిన శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాలలోని నేతలు మాత్రం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారంట. శ్రీకాకుళం జిల్లాకు స్పీకర్ పదవి, కడప జిల్లాకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవులు ఉండటంతో వారు కాస్త గమ్మునున్నా కానీ.. 14 సీట్లు గల అనంతపురం జిల్లా నేతలు మాత్రం ఆ రెండోదానికోసం ఆశగా చూస్తున్నారంట.

వీరిలో మళ్లీ ఫిల్టర్ చేసుకుంటే… జిల్లాలో అత్యంత సీనియర్ ‌గా ఉన్న అనంత వెంకట్రామిరెడ్డితో పాటు, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిలు కూడా యమ ఆశతో ఎదురుచూస్తున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో తాము ఫ్రెష్ అయినా కూడా లక్కీగా ఛాన్స్ దొరుకుతుందేమో అని ప్రకాశ్ రెడ్డి, పద్మావతిలు కూడా ఎదురుచూస్తున్నారట. ఎంతమంది ఎలా ఎదురుచూసినా… ఉన్నది ఒక్కటే అంటున్నారు కాబట్టి… ఆశవాహులకు ఎంత టెన్షనో జగన్ కు అంతకుమించిన పరీక్ష ఇది అని అంటున్నారు విశ్లేషకులు!