వివేకా హత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వివేక హత్య కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను టెక్నికల్ తప్పిదాల కారణంగా వెనక్కి పంపింది సిబిఐ కోర్టు. దీంతో మళ్ళీ ఛార్జ్ షీట్ ను రీ సబ్మిట్ చేసింది సిబిఐ. హై కోర్టు లో దస్తగిరి అప్రూవర్ పై వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది.
ఈ తరుణంలోనే ఛార్జ్ షీట్ రీ సబ్మిట్ చేసినట్టు కోర్టు కు తాజాగా తెలిపింది సిబిఐ. దస్తగిరిని ఆప్రువర్ గా మార్చడాన్ని సవాల్ చేసిన భాస్కర్ రెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్లపై విచారణ జరిగింది. ఇక ఈ కేసు విచారణనున ఈ నెల 20 వ తేదీకి వాయిదా వేసింది హై కోర్టు. ఇక ఈ కేసు విచారణ 2019 నుంచి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు అసలు దోషులు ఎవరో తెలియరాలేదు.