BREAKING : అసెంబ్లీలో బాలకృష్ణను చూస్తూ తొడగొట్టారు YCP ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ ఇవాళ మీసాలు తిప్పడం, తొడగొట్టడానికి వేదికైంది. సమావేశాలు ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు నిరసన చేపట్టగా… అంబటి వారిని వారించారు.
దీంతో ఆయనను చూస్తూ టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పారు. అది చూసి అంబటితో పాటు ఇతర వైసిపి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడగొట్టి బాలకృష్ణకు సవాల్ విసిరారు. ‘రా బయటకు చూసుకుందాం’ అన్నారు.
కాగా, ఏపీ అసెంబ్లీ ప్రారంభం అయిన కాసేపటికే వాయిదా పడింది. స్పీకర్ ముందు వైసీపీ పార్టీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీ దేవి రచ్చ చేశారు. దీంతో ఏపీ అసెంబ్లీ ప్రారంభం అయిన కాసేపటికే వాయిదా పడింది. కాసేపటి క్రితమే మొదటి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.