వినేవాడు ఉండాలే కానీ.. చెప్పేవాడు చిరంజీవి అవుతాడని అంటారు మనోళ్లు! ఇప్పుడు ఏపీ బీజేపీలో ఎంత మంది చిరంజీవులు ఉన్నారో లెక్కపెట్టడం కష్టంగా ఉంది! వీరంతా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షిం చేందుకు రాజకీయ కంకణాలు కట్టుకుని.. విల్లంబులు పట్టుకుని.. మేకతోళ్లు కప్పుకొని.. కోర్టుల చుట్టూ తి రుగుతున్నారు. ఎందుకని అడిగితే.. టాఠ్! ఏపీలో రాజ్యాంగం ఖూనీ అయిపోతోంది.. జగన్ అనే ఓ సత్రకా య్.. రాజ్యాంగాన్ని.. నియమాలను.. ఉల్లంఘించేస్తున్నాడు.. హన్నన్నా.. మేం ఉండగా ఇలా జరగనిస్తా మా?! ఏదైనా చేస్తే.. మేంచేయాలి కానీ.. అని దీర్ఘాలు.. శోకణ్నాలు పెడుతున్నారు.
ఏపీలో ఎన్నికల కమిషనర్‌ను రాజ్యాంగ విరుద్ధంగా తొలగించారని, ఆయన ఉన్నాడు కాబట్టి.. మేధావి కాబ ట్టి.. స్థానిక ఎన్నికలు వాయిదా వేశాడు కాబట్టి.. ఏపీ ప్రజలు నిశ్చితంగా గుండెల మీద రెండు చేతులేసుకు ని.. నెత్తిన గుడ్డేసుకుని నింపాదిగా నిద్రపోతున్నారని, లేకపోతే.. ఈ సీఎం సత్రకాయ్ మూలంగా కరోనా మ హమ్మారికి ఏనాడో వలై.. బలై పోయేవారని బీజేపీ నేతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. పాపం.. వాస్తవం తెలియని వాళ్లు.. బీజేపీ కాషాయం వెనుక కషాయం వంటి పొలిటికల్ పన్నాగం ఎరుగని వారు.. నిజమే కదా..అనుకుని చెప్పింది విని.. చెవులు దులుపుకొంటున్నారు. ఇన్ని నీతులు చెప్పే కమల కూటమికి.. నాబోటి గాడు ఏవో కొన్ని ప్రశ్నలు సంధిస్తే.. ఏం చేస్తారో?! ఏం చెబుతారో?!
రాజ్యంగం పరిరక్షిస్తామని.. రోడ్డెక్కిన కమల నాథులు.. మధ్యప్రదేశ్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు.. అయ్యో.. పాపం.. రాజ్యాంగ భారతి విలపిస్తోందని అనిపించలే దేం! పోనీ.. అంతెందుకు.. పక్కనే ఉన్న కర్ణాటకలో కుమారస్వామి-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చే సి.. యడియూరప్పకు పగ్గాలు అప్పగించినప్పుడు ఈ విలువలు ఏమైపోయాయి.? పోనీ.. మరో స్టేట్.. మహారాష్ట్రలో తెల్లవారుజామున అనైతికంగా ఫడణవీస్ కు మెజారిటీ లేకున్నా.. గద్దెపై కూర్చోబెట్టి.. రాజ్యాంగాన్ని అభాసుపాలు చేసిన వైనం గుర్తుకు రాలేదేం!
సరే.. ఇవన్నీ ప్రభుత్వాలు అనుకున్నా.. జమ్ము కశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు? ఎవరిని అడిగి రాజ్యాంగాన్ని మార్చేశారు? ఇవీ వద్దు.. ఏపీ విషయానికి వద్దాం.. ప్రత్యేక హోదా ఏమైంది? పార్లమెంటులో ప్రధానిగా మన్మోహన్ ఇచ్చిన హామీని కూలదొసినప్పుడు.. ప్రజాస్వామ్యం.. విలువలు గుర్తుకు రాలేదా?! చంద్రబాబు ప్రాపులో కుల సమీకరణలకు, కుల వ్యామోహాలకు మొగ్గ తొడిగిన వ్యక్తులు రాజకీయాల్లో ఉండి.. రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే.. వినేవారు వింటున్నా.. నవ్వే వారు నవ్వుతున్నారనే విషయం కమల నాదులు తెలుసుకుంటే బెటర్!!