జియో బంప‌ర్ ఆఫ‌ర్‌.. రీచార్జిపై డిస్కౌంట్ కూప‌న్లు..

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు ఎప్ప‌టికప్పుడు ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను అందిస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే ఆ సంస్థ ప్ర‌స్తుతం మ‌రొక బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌వేశపెట్టింది. జియో త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు తాజాగా 4x బెనిఫిట్స్ పేరిట ఓ కొత్త ఆఫ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో క‌స్ట‌మ‌ర్ల‌కు రిల‌య‌న్స్ డిజిట‌ల్‌, ట్రెండ్స్‌, ట్రెండ్స్ ఫుట్‌వేర్‌, ఆజియో కూప‌న్లు ల‌భిస్తాయి. వాటితో వారు ఆయా షాపుల్లో వ‌స్తువుల‌ను కొనుగోలు చేసి కూప‌న్ల‌లో ఇచ్చిన మేర వ‌స్తువుల‌పై రాయితీని పొంద‌వ‌చ్చు.

jio offers 4 coupons on recharging plans

ఇక ఈ ఆఫ‌ర్‌కు గాను క‌స్ట‌మ‌ర్లు రూ.249 లేదా అంత‌కు మించిన ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాలి. దీంతో 4 డిస్కౌంట్ కూప‌న్లు వ‌స్తాయి. వాటిని రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్‌ ఫుట్‌వేర్‌, ఆజియో స్టోర్ల‌లో ఉప‌యోగించుకోవ‌చ్చు. కొనుగోళ్ల‌పై డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. అయితే ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న అనంత‌రం క‌స్ట‌మ‌ర్ త‌న ఫోన్‌లో ఉండే మైజియో యాప్‌లోకి వెళ్లాలి. అక్క‌డ కూప‌న్స్ విభాగంలో స‌ద‌రు కూప‌న్లు జ‌మ అవుతాయి. వాటిని ఆ త‌రువాత క‌స్ట‌మ‌ర్లు వాడుకోవ‌చ్చు.

అయితే ఇప్ప‌టికే ఆయా ప్లాన్ల‌ను రీచార్జి చేసుకున్న వారు కూడా ఈ ఆఫ‌ర్‌ను పొంద‌వ‌చ్చ‌ని జియో తెలిపింది. ఇక అడ్వాన్స్ రీచార్జి చేసుకున్న వారికి కూడా ఈ కూప‌న్లు ల‌భిస్తాయి. ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంద‌ని జియో తెలిపింది.