కొడాలి నాని ఆకు రౌడీ… అక్కడ ఫోజులు కొట్టండి !

-

కొడాలి నాని ఓ ఆకు రౌడీ… సినిమాల్లో ఫోజులు కొట్టండి.. రాజకీయాలలో కాదని బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. ఏపీలో పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్న ఆయన సిఎం ఎప్పుడూ కనిపించరు.. వినిపించరని అన్నారు. హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చి ఒక పధకం ప్రకటిస్తారు.. మాయమైపోతారని, గతంలో ఇచ్చిన హామీలు, ఇసుక, మద్యం మాఫియా పై స్పందించరని అన్నారు. ఆర్ధిక పరిస్థితి పట్టించుకోకుండా… ఇష్టం వచ్చినట్లుగా సిఎం చేస్తున్నారని, గతంలో చంద్రబాబు అవలంబించిన విధంగా జగన్ ఆలన చేస్తూ ప్రజల పై అప్పుల భారాలు మోపుతున్నారని అన్నారు.

ఈ ప్రభుత్వానికి పేర్లు పైత్యం బాగా ముదిరింది..‌ కోవిడ్ వైరస్ కి కూడా YSR పేరు పెట్టారని అన్నారు. అదేమని ప్రశ్నిస్తే… బిజెపి పై మాటల‌ దాడి చేస్తున్నారని ఒక ఆకు రౌడీని మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్ధం అవుతుందని అన్నారు. వీధి రౌడీలా వ్యవహరిస్తున్న మంత్రి వాడుతున్న భాష పై సిగ్గుండాలని ఆయన అన్నారు. జూనియర్ యన్టీఆర్‌ దయతో టిడిపి లో గెలిచి… ఇప్పుడు చంద్రబాబు ను తిడుతున్నాడని, అలా మాట్లాడాలని, అలా ఉండాలని ఆ మంత్రి కి ఎవరు నేర్పారని అన్నారు. సినిమాల్లోకి వెళ్లి అలాంటి‌ వేషాలు వేసుకోండని ఆయన అన్నారు. ఇంత జరుగుతున్నా సిఎం జగన్ ఎందుకు అదుపులో పెట్టలేదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news