పదేళ్ల తర్వాత ఒకే వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్

-

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీట్ల విషయం కొలిక్కి రాగా తాజాగా ప్రచారంపై ఈ పార్టీలు దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇవాళ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడి వద్ద తొలి భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం చేశాయి. ఈ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని ఈ సభా వేదికగా పూరించనున్నారు. పొత్తు ఖాయమయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల సభను అత్యంత భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ప్రజాగళం బహిరంగ సభకు బీజేపీ నుంచి ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ సభ ద్వారా దాదాపు 10 ఏళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్లు ఒకే వేదికపైకి రానున్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ, బీజేపీలు మళ్లీ జట్టు కట్టగా.. ఈ రెండు పార్టీలతో జనసేన కూడా జతకలిసింది. అప్పట్లో గుంటూరులో జరిగిన సభలో మోదీ, చంద్రబాబు, పవన్‌ ఒకే వేదికపై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మళ్లీ పదేళ్ల తర్వాత ఇప్పుడు చిలకలూరిపేట వద్ద జరుగుతున్న సభలో ముగ్గురు అగ్రనేతలు ఒకే వేదికపైకి వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news