టీడీపీలో గ్రూపు రాజకీయాలకు కారణం ఎవరు..?

-

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఎన్నికల రణక్షేత్రంలో అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే గతానికి భిన్నంగా అభ్యర్థులను ముందే ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. సరిగ్గా నామినేషన్‌ ముందు వరకు కూడా అభ్యర్థులను ప్రకటించేవారు కాదు. చివరి నిమిషం వరకు చాలా చోట్ల ఉత్కంఠ కొనసాగిన పరిస్థితి. అయితే ఈసారి వాటన్నిటికీ చంద్రబాబు బ్రేక్ వేశారు. ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ ముందే వందకు పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. అయితే కొన్ని కీలక నియోజకవర్గాలను చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారు. ఇందుకు ప్రధాన కారణం ఆయా నియోజకవర్గాల్లో వర్గపోరుతో పాటు… ద్వితీయ శ్రేణి నేతలు సైతం టికెట్లు ఆశిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో అధినేత మాటే ఫైనల్‌ అనేది తొలి నుంచి వినిపిస్తున్న మాట. అధినేత ఇంఛార్జ్‌గా ప్రకటించిన తర్వాత… ఎన్నికల్లో గెలుపు వరకు ఆ నేతకు అంతా సహకరించాల్సిందే. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అధినేత చంద్రబాబు మాటను సైతం కొందరు నేతలు లెక్క చేయడం లేదు. ఇందుకు ప్రధాన కారణం… పార్టీలో నేనే నెక్ట్స్‌ అని వ్యవహరిస్తున్న నేత అనే మాట బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీలో గ్రూపు రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. చాలా నియోజకవర్గాల్లో ద్వితీయ స్థాయి నేతలను అచ్చెన్నాయుడు ప్రొత్సహించారనే మాట బలంగా వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్‌ నేతలు గౌతు శిరీష, గుండ లక్ష్మిదేవి, కలమట వెంకటరమణ, కిమిడి కళావెంకట్రావులకు టికెట్‌ రాకుండా అడ్డుకోవడంలో అచ్చెన్నాయుడు సఫలమయ్యారనే మాట వినిపిస్తోంది. పలాస, శ్రీకాకుళం, పాతపట్నం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలను అచ్చెన్నాయుడు దగ్గరుండి మరీ రెచ్చగొట్టారు కూడా. అటు రాయలసీమలోని పలు నియోజకవర్గాల్లో సైతం ఇదే పరిస్థితి. టికెట్‌ నీకే ఇప్పిస్తా అంటూ కొందరు నేతలకు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. రాజంపేట నియోజకవర్గంలో పార్టీ ఇంఛార్జ్‌ బత్యాల చెంగల్రాయుడుకు పోటీగా జగన్‌మోహన్‌ రాజును అచ్చెన్నాయుడు ప్రొత్సహించినట్లు తెలుస్తోంది. ఇలా దాదాపు 20 నుంచి 25 నియోజకవర్గాల్లో సీనియర్‌ నేతలకు చెక్‌ పెట్టేలా.. ద్వితీయ శ్రేణి నేతలను అచ్చెన్నాయుడు రెచ్చగొట్టినట్లు సమాచారం. ఈ విషయం అధినేత చంద్రబాబుకు తెలిసినప్పటికీ… ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news