BREAKING: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో దారుణం జరిగింది. చెరువులో పురిట బిడ్డ మృత దేహం కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆనకట్ట చెరువులో పురిట బిడ్డ మృతదేహం కలకలం రేపుతోంది. ఓ మూటలో చుట్టి పడేశారు.
ఆసుపత్రిలో డెలివరికాగా మృతి చెందగా… ఇక్కడ పడేసి వెళ్ళి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. సంఘటన స్థలానికి స్థానికులు, పోలీసులు వచ్చి పరిశీలన చేస్తున్నారు. మృతిచెందిన పురిటి బిడ్డ మృతదేహాన్ని పడేశారా.. లేక బతికుండగానే పడేసారా.. అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.