ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హింస వాతావరణం ఇప్పుడిప్పుడే చల్లబడుతోంది. ఇలాంటి తరుణంలోనే…పల్నాడు జిల్లా పెను సంచలనం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలోని ఓ వాలంటీర్ ఇంట్లో నాటు బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. బెల్లంకొండ నాగిరెడ్డిపాలెంలోని ఓ వాలంటీర్ ఇంట్లోనే ఈ బాంబులు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి తయారు చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ సంఘటన గురించి ఇంకా తెలియాల్సి ఉంది.