వారిద్దరే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి భారీ స్కెచ్.. సెలైంట్ అవుతారా..?

-

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బిఆర్ ఎస్ అధినేత కేసీయార్ సైలెంట్ అయ్యారు.. ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం, మంచి వాగ్దాటి కల్గిన కేసీఆర్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటంతో ఆ బాధ్యతను కేటీఆర్, హరీష్ రావులు మోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్నారు.. దీంతో వారికి చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెట్టారట..

గత ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ పార్టీపై బావ, బామర్దులే పోరాటం చేస్తున్నారు..చీమ చిటుక్కుమన్నా.. ప్రెస్ మీట్లు పెట్టి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీకి కంటిలో నలుసుగా మారిన బావ, బామర్దులపై అప్పర్ హ్యాండ్ సాధించేందుకు రేవంత్ రెడ్డి మాష్టర్ ప్లాన్ వేశారని ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అర్దమవుతుంది..

పూర్తిగా రుణమాఫి చేస్తే రాజీనామా చేస్తానంటూ హరీష్‌ రావు గతంలో ప్రకటించిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తాజాగా తెరమీదకు తీసుకొచ్చింది.. తెలంగాణాలోని రైతుందరికీ రుణమాఫి చేశామని.. హరీష్ రావ్ ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలంటూ కాంగ్రెస్ నేతలు డిమాండ్లు చేస్తున్నారు.. ఈ రకంగా హరీష్‌ ను ఇబ్బంది పెడితే.. సైలెంట్అవుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట..

మహిళలపై కేటీఆర్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం వెనుక రేవంత్ రెడ్డి ఉనారనే టాక్ వినిపిస్తోంది.. కేటీఆర్ నోటికి తాళం వెయ్యాలంటే ఇదే సరైన సమయమని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.. వీరిద్దరిని కట్టడి చేస్తే బీఆర్ ఎస్ ను ఓ ఆట ఆడుకోవచ్చని సీఎం భావిస్తున్నారట.. అందులో భాగంగానే ఈ పరిణామాలన్ని జరుగుతున్నాయని ఇందిరాభవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.. ఈ వ్యవహారంలో ఎవరు పై చెయ్యి సాధిస్తారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news