ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇప్పుడు కాకపోయినా సరే భవిష్యత్తులో అయినా వస్తుంది అని ఏపీ సిఎం వైఎస్ జగన్ అన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాలతో అవసరం లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రత్యేక హోదా రాకపోవచ్చు అని జగన్ చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన సంక్షేమ కార్యక్రమాల అమలుపై కూడా మాట్లాడారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికే రాజధాని విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ స్పష్టంగా చెప్పారు.
ప్రత్యేక హోదా ఇచ్చే వరకు గట్టిగా అడుగుతూనే ఉంటామని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇప్పటికిప్పుడు ఇచ్చే అవకాశం లేదు గాని తాము మాత్రం అడుగుతూనే ఉంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ మనసు మారి ప్రత్యేక హోదా వస్తుందని ఆశగా ఉన్నామని సిఎం స్పష్టంగా చెప్పారు. అవినీతి లేని వ్యవస్థ కోసం న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్ అని ఆయన వ్యాఖ్యానించారు.