BREAKING: సోము వీర్రాజుకు షాక్.. ఏపీ బీజేపీ అధ్యక్షుడి మార్పు

-

ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకి షాక్ తగిలింది. అందరూ ఊహించినట్లుగానే జరిగింది. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిని తొలగిస్తున్నట్లుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోము వీర్రాజు కి ఫోన్ చేసి తెలిపారు. అంతేకాదు తనకు కొన్ని కొత్త బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు సోము వీర్రాజు. ఇదే కాకుండా అందరూ ఊహించినట్లుగానే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు మార్పుపై కూడా చర్చలు జరుగుతున్నాయి.

ఢిల్లీలో జేపీ నడ్డాతో సమావేశమయ్యారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ బిజెపి కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తున్నట్లు నడ్డా చెప్పినట్టుగా తెలుస్తోంది. బండి సంజయ్ కి కూడా కొత్త బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లుగా సమాచారం. ఈ మేరకు సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news