చరిత్ర సృష్టించిన ఏపీ…ఆసియా ఖండంలో పొడవైన సొరంగాలు పూర్తి !

-

ఏపీలోని వెలిగొండ కల సాకారం అయింది. రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. 2019, మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కిమీల తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. మొదటి సొరంగాన్ని 2021, జనవరి 13న పూర్తి చేసిన ప్రభుత్వం….ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. దుర్భిక్ష ప్రాంతా రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రభుత్వం….శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీటిని తరలించడానికి ఫీడర్‌ ఛానల్‌ ఇప్పటికే పూర్తి చేసింది.

Breakthrough achieved in 2nd tunnel of two-tunnel Veligonda project, marking its completion

వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌ వైఎస్‌ హయాంలోనే పూర్తి అయింది. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరగానే నల్లమల సాగర్‌కు తరలించేందుకు రంగం సిద్ధం చేసింది ఏపీ సర్కార్‌. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకుంటున్నారు. ప్రకాశం, నెల్లూరు, కడపి జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలు సాగునీటి సరఫరాకు మార్గం సుగమం చేసింది ప్రభుత్వం. మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news