ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా…వరుసగా హత్య కేసులో నమోదు అవుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంఘటనలు మరింత పెరిగాయి. ఈ తరుణంలోనే అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో ఇంటి స్థలం విషయంలో అక్క మహబూబిపై తమ్ముడు జిలాని గొడ్డలితో దాడి చేశాడు.
దాడిలో మహబూబికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. నిందితుడు జిలానిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
అటు అనంతపురం జిల్లాలోనే మరో దారుణం చోటుచేసుకుంది. రాయదుర్గం మండలం మెచ్చిరిలో టీడీపీ నేత గొల్ల ఆదెప్ప(50)ను గుర్తు తెలియని దుండగులు హతమర్చారు. కర్ణాటక వెళ్లి తిరిగి వస్తుండగా ఆదెప్పను కిరాతకంగా చంపేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
https://x.com/ChotaNewsTelugu/status/1810865734945493372