దమ్ముంటే చంద్రబాబును ఎదుర్కో – జగన్ కు బుద్దా సవాల్‌

-

దమ్ముంటే చంద్రబాబును ఎదుర్కో అటూ సీఎం జగన్ మోహన్‌ రెడ్డికి బుద్దా వెంకన్న సవాల్‌ విసిరారు. చంద్రబాబు పర్యటనకు లారీ అడ్డం పెట్టి అడ్డుకుంది ఎవరు..? ఆ లారీని పక్కకు తీస్తుంటే టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారని ఆరోపించారు. రోడ్డుకు లారీ అడ్డం పెట్టిన వారిని పోలీసులు అరెస్టు చేశారా..? పధ్నాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబును అడ్డుకుంటే పోలీసులు ఏం చేస్తున్నారు..? అని ఫైర్‌ అయ్యారు.

పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు పని‌ చేశారని.. మా అధినేత మీదకు వస్తే చూస్తూ ఊరుకోవాలా..? అని మండిపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు గాయపడటం బాధాకరమన్నారు. ఆ‌ జిల్లా ఎస్పీ వైసిపి నాయకుడిలా మాట్లాడుతున్నారని చెప్పారు. పోలీసు అధికారుల సంఘానికి టీడీపీ నాయకులే గుర్తు వస్తారా..? మీ అధికారులను బూతులు తిట్టిన మంత్రులను ఎందుకు ప్రశ్నించలేదని ఆగ్రహించారు. చంద్రబాబును వ్యక్తిగతంగా దూషిస్తే తప్పు అని జగన్ని కోరారా..? మీకు హక్కుగా రావాల్సిన వేతనాల్లో జగన్ కోత పెట్టాడని ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు. వీటిపై పోలీసు అధికారుల సంఘానికి బాధ లేదా..? ఎందుకు మాట్లాడరు..? డీజీపీ, విషాంత్ రెడ్డి, అమ్మిరెడ్డిలు చంద్రబాబుపై పగతో పని చేస్తున్నారని మండిపడ్డారు బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Latest news