ఆర్టీసీ కార్మికుల మీద ప్రభుత్వానికి ప్రేమ లేదు – కిషన్ రెడ్డి

-

రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థకు చెందిన కార్మికుల మీద ప్రభుత్వానికి ప్రేమ లేదని, కేవలం ఆర్టీసీకి ఉన్న ఆస్తుల మీదే ప్రేమ ఉందని అన్నారు.

ఇక గవర్నర్ మాట్లాడుతూ.. తాను ఆర్టీసీ విలీన బిల్లుకు వ్యతిరేకం కాదని తెలిపారు. ఇక తమకు మంచి రైల్వే స్టేషన్ ఇచ్చినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు గవర్నర్. తాను తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా రైలులోనే ప్రయాణిస్తున్నారని.. సామాన్యుల కోసమే రైల్వే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. అయితే ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించిన వెంటనే టేబుల్ చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news