ఏపీలో ఇవాళ్టి నుంచి బస్సు ఛార్జీల పెంపు అమలు..వివరాలు ఇవే

-

డీజిల్ సెస్ పెంపుతో ఇవాళ్టి నుంచి ఏపీలో ఆర్టీసీ బస్ ఛార్జీలు… భారీగా పెరగనున్నాయి. డీజిల్ సెస్ తో పాటు కనీస ఛార్జీలను పెంచిన ఆర్టీసీ…. ప్రయాణ దూరాన్ని బట్టి కనిష్టంగా రూ.10 గరిష్టంగా రూ.140 పైన డీజిల్ సెస్ వసూలు చేయనుంది. బేసిక్ ఛార్జీ, డీజిల్ సెస్ కలిపి కిలోమీటర్ల ప్రతిపాదికన మొత్తం చార్జీని నిర్ణయించిన ఆర్టీసీ… పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు మినహా అన్ని బస్సుల్లో కనీస చార్జీలు పెంచింది. పల్లెవెలుగు,ఆల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో కనీస చార్జీ రూ.10 యథాతథంగా ఉంచింది ఆర్టీసీ.

ఎక్స్ ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 5 పెంచిన ఆర్టీసీ.. దూరప్రాంత, ఏసీ, నాన్ ఎసీ, స్లీపర్ బస్సుల్లో కనీస చార్జీ రూ.10 పెంచింది. ఇకపై పల్లె వెలుగు బస్సుల్లో కిమీకు రూ. 1.02 మేర ఛార్జ్ చేయనున్న ఆర్టీసీ… పల్లె వెలుగు బస్సుల్లో కనిష్టంగా రూ.5, గరిష్టంగా రూ 20 మేర డీజిల్ సెస్ పెరిగింది.
ఇకపై అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో కి.మీకు రూ. 1.13 వసూలుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ఆర్టీసీ.

అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో కనిష్టంగా రూ.5 గరిష్టంగా రూ 25 మేర డీజిల్ సెస్ పెరగడంతో… ఇకపై ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కనీస చార్జీ -రూ.20 కు పెరగనుంది. ఇకపై ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కి.మీకు రూ. 1.25 మేర వసూలు చేయనున్న ఆర్టీసీ. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో డీజిల్ సెస్ కనిష్టంగా రూ.5 గరిష్టంగా రూ. 90 పెరిగింది. ఇకపై అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కనీస చార్జీ-రూ.25 పెరగనుండగా.. ఇకపై ఆల్ట్రా డీలక్స్ బస్సుల్లో కి.మీకు రూ.1.55 చార్జీ మేర వసూలు చేయనుంది ఆర్టీసీ.

ఛార్జీల పూర్తి వివరాలు :
ఆల్ట్రా డీలక్స్ బస్సుల్లో డీజిల్ సెస్ కనిష్టంగా రూ.5 గరిష్టంగా రూ.120.

ఇకపై సూపర్ లగ్జరీ బస్సుల్లో కనీస చార్జీ -రూ.40

ఇకపై సూపర్ లగ్జరీ బస్సుల్లో కి.మీ కు రూ. 1.62 పైసలు.

సూపర్ లగ్జరీ బస్సుల్లోడీజిల్ సెస్ కనిష్టంగా రూ.10 గరిష్టంగా రూ.120

ఇంద్ర బస్సుల్లో ఇకపై కనీస చార్జీ రూ.50

ఇంద్ర బస్సుల్లో కి.మీకు ఇకపై రూ. 1.96 మేర ఛార్జ్ చేయనున్న ఆర్టీసీ.

ఇంద్ర బస్సుల్లో డీజిల్ సెస్ కనిష్టంగా రూ.10 గరిష్టంగా రూ. 140.

గరుడ బస్సుల్లో ఇకపై కనీస చార్జీ -రూ.50

గరుడ బస్సుల్లో ఇకపై కి.మీ కు రూ. 2.21 మేర వసూలుకు నిర్ణయం.

గరుడ బస్సుల్లో డీజిల్ సెస్ – కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.140.

మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఇకపై కనీస చార్జీ-రూ.50

మెట్రో లగ్జరీ ఎసీ బస్సుల్లో ఇకపై కి.మీకు రూ.2.21పైసలు.

మెట్రో లగ్జరీ ఎసీ బస్సులో డీజిల్ సెస్ – కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.140.

అమరావతి ఎసీ బస్సుల్లో ఇకపై కనీస చార్జీ -రూ.50

అమరావతి ఎసీ బస్సుల్లో ఇకపై కి.మీ కు రూ.2.49

అమరావతి ఏసీ బస్సుల్లో డీజిల్ సెస్ -కనిష్టంగా రూ.10 గరిష్టంగా -రూ.140.

డాల్ఫిన్ క్రూయిజ్ బస్సుల్లో ఇకపై కనీస చార్జీ – రూ.50

డాల్భిన్ క్రూయిజ్ బస్సుల్లో చార్జీ- కి.మీ కు రూ2.49
డాల్ఫిన్ క్రూయిజ్ బస్సుల్లో డీజిల్ సెస్ -కనిష్టంగా రూ.10 ,గరిష్టంగా రూ.140

నైట్ రైడర్ బస్సుల్లో ఇకపై కనీస చార్జీ -రూ.50

నైట్ రైడర్ సీట్ బస్సుల్లో కి.మీకు రూ. 2.21.

నైట్ రైడర్ బస్సుల్లో డీజిల్ సెస్ – కనిష్టంగా రూ. 10 , గరిష్టంగా రూ. 140.

నైట్ రైడర్ బెర్త్ బస్సు డిజిల్ సెస్ తో కలిపి కి.మీకు రూ.2.60 వసూలు చేయనున్న ఆర్టీసీ.

వెన్నెల స్లీపర్ బస్సుల్లోఇకపై కనీస చార్జీ- రూ.80

వెన్నెల 30 బెర్తుల బస్సుల్లో కి.మీ కు రూ 2.90 చార్జీ.

వెన్నెల 24 బెర్తుల బస్సుల్లో కి.మీ కు రూ. 3.03 చార్జీ.

వెన్నెల బస్సుల్లో డీజిల్ సెస్ – కనిష్టంగా రూ. 10, గరిష్టంగా రూ.140.

తిరుపతి -తిరుమల మధ్య తిరిగే బస్సుల్లోచార్జీలు పెంచిన ఆర్టీసీ

తిరుపతి -తిరుమల ఎక్స్ ప్రెస్ బస్సుల్లో టికెట్ ధర రూ.75 నుంచి రూ.90 కి పెంపు

తిరుపతి -తిరుమల ఎక్స్ ప్రెస్ రాను పోను టికెట్ -రూ.135 నుంచి రూ.160 కి పెంపు

Read more RELATED
Recommended to you

Latest news