BREAKING : వైఎస్‌ షర్మిలపై కేసు నమోదు

-

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ రోజురోజుకు పెరుగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం రంజుగా మారుతోంది. ఎన్నికల ప్రచారంతో నేతలు హోరెత్తిస్తున్నారు. అయితే తమ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్న సమయంలో కొంతమంది నేతలు నోరు అదుపుతప్పుతున్నారు. ఫలితంగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొంతమంది నాయకులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడి కేసుల్లో చిక్కుకుంటున్నారు.

తాజాగా ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న ప్రసంగాల్లో పదే పదే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయాన్ని ప్రస్తావిస్తున్నారని ఆమెపై కేసు నమోదైంది. వైఎస్సార్‌ జిల్లాలోని బద్వేలు పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు అంశాన్ని ప్రస్తావించినందుకు గాను ఆమెపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల కడప కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినా ఆమె తరచూ ఆ విషయాన్ని ప్రస్తావిస్తుండటంతో కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news