రేవంత్ రెడ్డి లాగుల తొండలు జొర్రకొట్టాలే అంటూ KTR సంచలన వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రాజేంద్రనగర్లో జరిగిన రోడ్ షో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మార్పు బాగుందా? బాగాలేకపోతే కాంగ్రెస్ పార్టీని చీరి చింతకు కట్టేయాలే అని పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఆయన లాగుల తొండలు జొర్రకొట్టాలేనని.. నాకు ఆ భాష రాదు గానీ తప్పటం లేదు మాట్లాడాల్సి వస్తోందని ఫైర్ అయ్యారు. మహిళలకు రూ. 2,500, ఇంట్లో పెద్ద మనుషులు ఇద్దరికీ 4 వేలు అన్నాడు.. తులం బంగారం, స్కూటీలని రేవంత్ అన్నాడు.. వచ్చినయా? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని అనుకునేటోళ్లకు మంచి ఉపాయం చెబుతానన్నారు. మీరు చేయాల్సిదల్లా ఒక్కటే.. 13 మే నాడు కారు గుర్తు మీద ఓటు వేయండి…10-12 సీట్లు మాకు అప్పగించండి.. 6 నెలల్లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారన్నారు.