వైఎస్ వివేకా హత్య కేసులో భాగంగా ఇవ్వాల కోఠి సీబీఐ ఆఫీస్ లో విచారణ కు రావాలంటూ..ఎంపీ అవినాష్ రెడ్డి కి సీబీఐ నోటీసులు ఇచ్చింది. సీఆర్ పీసీ సెక్షన్ 160 ప్రకారం నోటీసులు ఇచ్చింది సీబీఐ. తన విచారణ పారదర్శకంగా సాగట్లేదు అంటూ..హైకోర్ట్ ను ఆశ్రయించారు అవినాష్ రెడ్డి. ఇక హై కోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ పై విచారణ కొనసాగే అవకాశం ఉంది.
6 అంశాలు ప్రస్తావిస్తూ పిటిషన్ వేశారు అవినాష్ రెడ్డి. జనవరి 28 ఫిబ్రవరి 24న ఆడియో వీడియో రికార్డింగ్ లేకుండా రికార్డ్ చేసిన స్టేట్మెంట్ ను పరిగణలోకి తీసుకోవద్దని… సిబిఐ జరిపే విచారణను మొత్తం ఆడియో వీడియో రికార్డింగ్ చేసెలా సీబీఐ కి ఆదేశాలు ఇవ్వాలన్నారు. విచారణ సందర్భంగా న్యాయవాదిని అనుమతించాలని… జనవరి 28, ఫిబ్రవరి 24 తేదీలలో సిబిఐ రికార్డ్ చేసిన నా స్టేట్మెంట్లను కోర్టుకు ప్రొడ్యూస్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. హైకోర్ట్ నిర్ణయం తరువాతే …తనను విచారించాలని, అప్పటి వరకు తనకు సమయం ఇవ్వాలని సీబీఐ కి మెయిల్ చేసే ఆలోచనలో ఉన్నారు అవినాష్ రెడ్డి.