కేంద్ర నిధులను మళ్లిస్తున్నారు – పురందేశ్వరి

-

రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్ళి ఇస్తుందని ఆరోపించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. ఆదివారం కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పురందేశ్వరి మాట్లాడుతూ.. రాయలసీమ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామన్నారు. పొత్తులపై సరైన సమయంలో జాతీయ అధ్యక్షడు నిర్ణయం తీసుకుంటాడని తెలిపారు. రాష్ట్రంలో అభవృద్ధి శూన్యం అని విమర్శించారు పురందేశ్వరి. పేద ప్రజలకు ఇంటి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే రాష్ట్ర ప్రభత్వం ఇళ్ళ నిర్మాణం చేయడం లేదన్నారు.

కేంద్ర నిధులను దారిమళ్లిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం 14,15 ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలు నిధులు ఇస్తున్నా ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్ళిస్తుందన్నారు. సర్పంచ్ లు చిన్న అభివృద్ధి పనులు కూడా చేయలేకపోతున్నారని అన్నారు. రాయలసీమలోని గుడ్రేవుల ప్రాజెక్ట్, సిద్దేశ్వరం అలుగు చిరకాల కల అలాగే ఉందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో 780 కోట్ల మేర బిల్లులు ఇచ్చారు కానీ.. పనులు మాత్రం జరగలేదన్నారు. కనీసం ప్రాజెక్టుల మరమ్మత్తులు కూడా చేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news