మోదీ విజయవాడ రోడ్‌షోలో డ్రోన్లు.. నివేదిక పంపాలని ఏపీ డీజీపీకి ఆదేశ

-

ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ పర్యటనలో భద్రతా లోపంపై కేంద్రం తీవ్రంగా ఫైర్ అయింది. మోదీ రోడ్‌షో మార్గంలోకి నిషేధాజ్ఞలు ఉల్లంఘించి రెండు డ్రోన్లు దూసుకొచ్చిన ఘటనను సర్కార్ తీవ్రంగా పరిగణించింది. అత్యంత కట్టుదిట్టమైన రక్షణలో ఉండే ప్రధాని పర్యటనలో చోటుచేసుకున్న ఈ ఘటనపై కేంద్రం సీరియస్‌ అయింది. భద్రతా లోపంపై ఏపీ డీజీపీ, సీఎస్‌లను వివరణ కోరింది.

ఈ నెల 8న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌లతో కలిసి ప్రధాన మంత్రి విజయవాడలో రోడ్‌షో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ రావడానికి 45 నిమిషాల ముందు రెండు డ్రోన్లు ఎగిరినట్లు కేంద్ర భద్రతా ఏజెన్సీ గుర్తించి హోంశాఖకు నివేదిక ఇచ్చింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ.. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధాని భద్రతకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆక్షేపించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలనీ, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version