ప్రకాశం బ్యారేజీ పటిష్టతపై నిపుణులతో చర్చిస్తాం..!

-

గతంలో ఎన్నడూ చవి చూడనంత జల ప్రళయాన్ని విజయవాడ చవి చూసింది. కృష్ణా నది, బుడమేరు పొంగింది. సీఎం చంద్రబాబు కలెక్టరేటునే సెక్రటేరీయేట్ చేసుకున్నారు. చంద్రబాబు అండ్ టీం 24 గంటలు పని చేశారు అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు. కేంద్రం పూర్తి సహకారం అందిస్తోంది. ఇంతటి జల ప్రళయం సంభవించినా మృతులు సంఖ్యని తగ్గించగలిగారు. ఐఏఎస్ అధికారులకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించడం దేశంలోనే తొలిసారి. వరద సాయంపై బాధితులు సంతృప్తితో ఉన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి.

అలాగే ప్రకాశం బ్యారేజ్ 70 ఏళ్ల పురాతనమైంది. మరింత వరద వచ్చినా తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీని పటిష్టపరుస్తాం. ప్రకాశం బ్యారేజీ పటిష్టతపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చిస్తాం. ప్రకాశం బ్యారేజీ పటిష్టతపై నిపుణులతో చర్చిస్తాం. బుడమేరు సమీపంలో అక్రమ మైనింగ్ జరపడం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయని తెలిసింది. పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయి. కేంద్ర బృందాలు వరద నష్టంపై అంచనాలు వేస్తాయి. గత ప్రభుత్వం ఫసల్ బీమా యోజనా పథకాన్ని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. వరద నష్టం అంచనాపై క్లారిటీ రాగానే కేంద్రం నుంచి సాయం అందిస్తాం అని శివరాజ్ సింగ్ చౌహన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news