ఏపీలో కురిసిన భారీ వార్షాలతో నదులు, వాగులు ఉపొంగుతున్న విషయం తెలిసిందే. బుడమేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. కానీ బుడమేరుకు గండ్లు పడటంతో కొల్లేరులోకి దాని వరద వస్తుంది. దీంతో కొల్లేరులో నీటిమట్టం పెరుగుతుంది. అయితే ఏలూరు నుండి కైకలూరు వచ్చే రహదారి మీదగా నీరు ప్రవహించడంతో వాహనాలు వెళ్ళకుండా నిలుపుదల చేసారు పోలీసులు. అయితే ఈ రాత్రికి కొల్లేరు వరద నీరు పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా వేస్తున్నారు.
కానీ ఇప్పటికే కొన్ని గ్రామాలు నీట మునిగాయి. ఇక కొల్లేరులోని వరద రెండు అడుగుల మేర పెరిగితే భారీ నష్టం జరిగే అవకాశం ఉంది.బుడమేరు కొల్లేరులోకి ప్రవహించడంతో కొల్లేరు ప్రజలు, చేపల రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ నీరు కొన్ని గ్రామాలకు వెళ్లే రహదారులు నీట మునగడంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పినుమాకులంక, నందిగామ లంక, ఇంగిలి పాక లంక , మణుగూరు, కోమటి లంక గ్రామాల ప్రజలు వరద వల్ల ఇబ్బందులు పడుతున్నారు.