బ్రేకింగ్ : టీడీపీ కీలక నేత కరోనాతో మృతి

-

ఏపీలో కరోనా తన విశ్వ రూపం చూపిస్తోంది. రోజూ పదివేలకి తక్కువ కాకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. సామాన్యులకే కాక అధిక సంఖ్యలో ప్రజాప్రతినిదులకి కూడా కూడా కరోనా సోకుతోంది. తాజాగా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే టీడీపీ కీలక నేత ఒకరు కరోనాతో మరణించడం ఆ పార్టీలో తీరని విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళ్తే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కరోనా పాజిటివ్ తో మృతి చెందారు. గత పది రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రామాంజనేయులు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఐదు గంటలకు రామాంజనేయులు మృతి చెందారు. రామాంజనేయులు స్వస్థలం కృష్ణా జిల్లా కలిదిండి మండలం అవ్వకూరు. రామాంజనేయులు మృతి పట్ల మాజీ మంత్రులు దేవినేని ఉమా,కొల్లు రవీంద్రలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈయనకి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వెంటనే దాని ఛైర్మన్ గా నియమించారు అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news