భేటీ వెనక బాబు… ఫుటేజ్ వెనక సాయి… ఫలితం నిమ్మగడ్డకు?

-

మీడియా కంటే సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న రోజులివి. మీడియాలో జర్నలిస్టులు అనుమానించాలన్నా, ప్రశ్నించాలన్నా.. ఆఖరికి ఎలా స్పందించాలన్నా సవాలక్ష టెర్మ్స్ & కండిషన్స్ యాజమాన్యం నుండి ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తమ తమ అనుమానాలను, అభిప్రాయాలను వెళ్లబుచ్చేవారికి మాత్రం ఫోన్ లో చార్జింగ్ ఉంటే చాలు, ఆ ఫోన్ కి నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు అన్నట్లుగా తయారైన రోజులివి. ఈ క్రమంలో తాజాగా ఉదయం నుంచి ఆన్ లైన్ లోనూ, మీడియాలోనూ రచ్చ రచ్చ జరుగుతున్న పార్క్ హయత్ రహస్య భేటీపై ఆన్ లైన్ లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ భేటీ వెనక ఉన్నది చంద్రబాబే అని ఇప్పటికే వైకాపా నేతలు మైకుల ముందుకు రాగా… ఈ భేటీలో కనిపిస్తున్నది ముగ్గురే అయినా కనిపించని నాలుగో బిగ్ బాస్ ఆన్ లైన్ ద్వారా ఈ మీటింగ్ లో పాల్గొన్నారని విజయసాయి ట్విట్టర్ లో స్పందించారు. ఇందులో నిజంగా బాబు పాత్ర ఉంటే మాత్రం… నిమ్మగడ్డకు అంతకు మించిన అప్రతిష్ట, వైకాపాకు అంతకుమించిన బలం, బాబుకు అంతకు మించిన అపఖ్యాతి మరికటి ఉండదు అనడంలో అతిశయోక్తి లేదు!

అయితే… ఈ విషయాలపై ఆన్ లైన్ యువత “ఈ ఫుటేజ్ లీకేజి అనేది విజయసాయి రెడ్డి పనే” అని ఆన్ లైన్ వేదికగా కామెంట్ చేస్తున్నారు! కొందరు వైకాపా కార్యకర్తలు మాత్రం… బాబును మానసికంగా ఇబ్బందులు పెట్టాలంటే.. రోజు రోజుకీ నిద్రలేకుండా చేయలంటే.. అందులో సాయిరెడ్డి పాత్ర కచ్చితంగా ఉంటుందని, ఆ విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపణ అయ్యిందని, ఇది లేటెస్ట్ విక్టరీ అని వ్యాఖ్యానిస్తున్నారు.

ఏది ఏమైనా ఈ విషయంలో వైకాపా సానుభూతిపరులో, నేతలో పక్కా ప్లాన్ తో వ్యవహరించారని.. తెలంగాణలో ఓటుకు నోటు కేసు ఎంతగా సెన్షేషన్ అయ్యిందో.. ప్రస్తుతం ఉన్న రాజకీయాల నేపథ్యంలో ఏపీలో ఈ కేసు అంతకంటే ఎక్కువ సంచలనమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా… “భేటి వెనక బాబు.. ఫుటేజ్ వెనక సాయి” అనే అంశం మాత్రం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది!

ఈ భేటీ వెనక బాబు ఉన్నా లేకున్నా.. ఈ ఫుటేజ్ లీక్ అవ్వడం వెనుక విజయసాయిరెడ్డి హస్తం ఉన్నా లేకున్నా… ఈ ఫుటేజ్ మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అప్రతిష్టపాలు చేసిందనే కామెంట్లు మాత్రం వినిపిస్తున్నాయి. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తుల మీద మాత్రమే ప్రజలకు పూర్తి నమ్మకాలు ఉంటున్న ఈ రోజుల్లో.. ఏ ఎన్నికల అధికారికీ రానన్ని వివాదాలు ఆయన్ని చుట్టుముట్టాయి. అందులో ఆయన స్వయంకృతాపరాధాలే ఎక్కువని దీన్నిబట్టి తెలుస్తుందని అంటున్నారు విశ్లేషకులు. దీన్ని ఆయన కడిగేసుకునే ప్రయత్నం చేస్తారా లేక లైట్ తీసుకుని దులుపుకుపోతారా అనేది వేచి చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version