చంద్రబాబు కేసు.. రేపు కీలక విచారణలు

-

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు రేపు విచారించనుంది. విజయవాడ ఏసిబి కోర్టు బెయిల్ నిరాకరించడంతో సిబిఎన్ లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఆటు బాబు హెల్త్ రిపోర్ట్ పై సిఐడి దాఖలు చేసిన కౌంటర్ పై విజయవాడ ఏసిబి కోర్టు రేపు విచారించనుంది.

ఇక ఫైబర్ నెట్ కేసులో సిబిఎన్ పిటి వారెంట్ అమలును ఈ నెల 20 వరకు వాయిదా వేయాలన్న సిఐడి పిటిషన్ పై ఏసీబీ కోర్టు ఇవాళ నిర్ణయం వెల్లడించనుంది. . అయితే.. చంద్రబాబు లీగల్ ములాఖత్‌లకు అధికారులు కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదించారు. చంద్రబాబు ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమ నిర్ణయం ప్రకటన సందర్భంగా తెలిపారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు జైలు అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు.చంద్రబాబు ములాఖత్ వల్ల ఖైదీల రాకపోకలకు ఇబ్బంది అంటూ చెప్పడంపై టీడీపీ మండిపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news