పురందేశ్వరి ఉన్నారు కాబట్టే పొత్తు సాధ్యమైంది : చంద్రబాబు

-

పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే గతం గుర్తొస్తోంది. ఆ రోజుల్లో భయంకరమైన పరిస్థితులుండేవి అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ ఏపీకి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే.. రోడ్డు మార్గంలో వచ్చారు. రోడ్ మార్గంలో కూడా పవన్ కళ్యాణ్ ను రానివ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ రోడ్ మీదే పడుకున్నారు. సాధారణంగా సినిమావాళ్లు ఇదంతా చేయరు.. కానీ పవన్ పట్టుదలతో ప్రజాస్వామ్యం కోసం కష్టపడి పని చేశారు. జైల్లో ఉన్న నన్ను పరామర్శించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా పొత్తు గురించి ప్రకటన చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్.

బీజేపీతో పొత్తులో ఉన్నా.. టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. బీజేపీని కూడా ఒప్పిస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్. నాది, పవనుది ఒకే ఆలోచన. ప్రజలు గెలవాలి.. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేయాలనేదే మా ఇద్దరి ఆలోచన. సీట్ల విషయంలో కూడా ఏ చిన్న గ్యాప్ లేకుండా పని చేశాం. పురందేశ్వరి కూడా పొత్తు గురించి కృషి చేశారు. వేరే వారు బీజేపీ అధ్యక్షునిగా ఉంటే ఏమయ్యేదో తెలీదు కానీ.. పురందేశ్వరి ఉన్నారు కాబట్టి పొత్తు సాధ్యమైంది. ముగ్గురు కలిసి పోటీ చేస్తే రాష్ట్రానికి పునర్ వైభవం తేవచ్చని భావించాం. పొత్తు వల్ల నష్టం వస్తుందేమోననే అనుమానాల్ని కొందరు వ్యక్తం చేశారు.. కాదు లాభమని మేం ఇద్దరం నమ్మాం.. అదే నిజమైంది అని చంద్రబాబు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version