ఇవాళ్టి నుంచి నా కాళ్లకు దండం పెట్టకండి – సీఎం చంద్రబాబు సంచలనం

-

ఇవాళ్టి నుంచి నా కాళ్లకు దండం పెట్టకండి అంటూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు… అనంతరం మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని కోరారు. ఇక నుంచి ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే, ఇక నేను వారి కాళ్లకు దండం పెడతానని తెలిపారు.

CM Chandrababu for TDP office

ఇవాళ్టీ నుంచి నా కాళ్లకు దణ్ణం పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెడుతున్నానని వివరించారు. తల్లిదండ్రులు, భగవంతుడు కాళ్లకు దణ్ణం పెట్టాలి తప్ప నాయకులకు కాదని వెల్లడించారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవ్వరూ తమ గౌరవాన్ని తగించుకోవద్దని కోరారు సీఎం చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దణ్ణం పెట్టకూడదనే సంస్కృతికి నా నుంచే ప్రారంభిస్తున్నానని తెలిపారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news