Telangana Rains : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణకు 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయి. ఈశాన్య ఋతుపవనాల కారణంగా వచ్చే మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పారు. పరచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు.
ముఖ్యంగా ఇవాళ నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, మహబూబ్నగర్, వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్, ములుగు, కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజిగిరిలో చెదురుమధురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని….. రాత్రి సమయం లో ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెల్సియస్ గా ఉండే అవకాశం ఉందన్నారు. ఇక నిన్న హైదరాబాద్ లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే.