రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతుల ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు.
ధాన్యపు రాశులు వర్షాలకు తడవకుండా సమీప రైసు మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసు కోవాలని సూచనలు చేశారు. రైతులకు అవ సరమైన టార్ఫాలిన్లు సమకూర్చాలని చెప్పిన సీఎం చంద్రబాబు…వాళ్ల కు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని ఆదేశాలు ఇచ్చారు. రైతులందరూ వ్యవసాయ శాఖ సూచనలను ఖచ్చితం గా పాటించేలా చూడాలని కలెక్టర్ల ను ఆదేశించారు చంద్రబాబు నాయుడు. అయితే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేయడంతో… రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.