ఏపీ ఖజానా ఖాళీ…ఏం చేయాలో అర్థం కావడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలూరు చేరుకున్న సీఎం చంద్రబాబు..ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నా దగ్గర డబ్బులు లేవు ఖజానా ఖాళీ రోజు రోజుకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఏపీ ఆదాయం పడిపోయింది, 10 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలని పేర్కొన్నారు.
వచ్చే ఆదాయం వడ్డీకి సరిపోయేలా చేశారని ఆగ్రహించారు. వరదల కారణంగా నష్టపోయిన వారి రైతులకు ఎకరాకు పది వేలు ఇస్తాను.. అది కూడా తక్కువేనని చెప్పారు. రాజకీయ పార్టీ కార్యాలయాల పైన దాడులు చేస్తారు, అరెస్టు చేస్తే నిరసన చేస్తారని వివరించారు. కానీ నేను ప్రతిరోజు బురదలో దిగాను.. నేను దిగాను కాబట్టి అధికారులంతా సమన్వయంతో పనిచేశారన్నారు. ప్రజలంతా శభాష్ అనే విధంగా అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుందని కొనియాడారు. నా దెబ్బకు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలో దిగే పరిస్థితికి వచ్చారు.. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వారి ఆస్తులకు నష్టం జరగకుండా చూడాలని వివరించారు.