జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ తో భేటీ వెనుక జగన్ వ్యూహం అదేనా..?

-

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు అందరూ వరుసగా జైలుకు వెళ్తున్నారు.. పాత కేసులను తిరగతోడి మరి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.. జైలుకు వెళ్లిన వారందరికీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారు.. వారితో ములాఖత్ అవుతున్నారు.. గతంలో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సైతం జగన్ ములాఖత్ లో భేటీ అయ్యారు.. కేడర్ కు ముఖ్య నేతలకు అందుబాటులో ఉన్నాను అనే భరోసాను కల్పించేందుకు ఆయన జైల్లో ఉన్న నేతలను పరామర్శిస్తున్నారు..

గుంటూరు జైల్లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ని కూడా జగన్మోహన్ రెడ్డి కలిశారు.. అక్రమ కేసుల్లో సురేష్ ని అరెస్ట్ చేశారంటూ ఆయన ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. మొన్నటిదాకా వరద బాధితులకు అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు కష్టాల్లో ఉన్న క్యాడర్ కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే ఈ ములాఖత్ ల వెనక రాజకీయ వ్యూహం ఉందని జగన్ సన్నిహితులు చెబుతున్నారు.. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవ్వడం ఖాయం అంటూ తెలుగుదేశం పార్టీ అనేక ప్రకటనలు చేసింది.. అందుకు తగ్గట్టుగానే పలువురు నేతలని పార్టీలోకి ఆహ్వానిస్తుంది.. మాట వినని వారిని జైలుకు పంపిస్తోంది.. దీంతో జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహాన్ని మార్చినట్లు ప్రచారం జరుగుతుంది..

మాచర్ల నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు వెళ్లి కలిసిన జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి పార్టీ కేడర్ కి ఒక సందేశాన్ని ఇచ్చారు.. ఆయా సామాజిక వర్గాల్లో ఉండే బలమైన నేతలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని.. రాజకీయ భవిష్యత్తుకు తాను హామీ అన్నట్లు అయన వ్యవహరించారు.. దీంతో దూరమైందనుకుంటున్న రెడ్డి సామాజిక వర్గం.. జగన్కు దగ్గరయ్యేందుకు ఈ భేటీ ఉపయోగపడిందనే చర్చ నడిచింది . గత ఎన్నికలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు దూరమవడం వల్లే వైసీపీ ఓడిపోయిందని వాదన పార్టీలో ఉంది.. దాన్ని అధిగమించేందుకు జగన్ అమలు చేస్తున్న రాజకీయ స్టేటజీలో ఇదొక భాగమనే డిస్కర్షన్ పార్టీలో జరుగుతుంది..

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్కు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు.. జగన్ కి నమ్మకస్తుడిగా ఉన్నందుకే.. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తనను జగన్ అక్కున చేర్చుకున్నాడని పలు సందర్భాల్లో సురేష్ సైతం వెల్లడించారు.. ఈ క్రమంలో తనను నమ్ముకున్న వారికి అండగా ఉంటాననే మెసేజ్ ని క్యాడర్ కి పంపేందుకు సురేష్ ని జగన్ కలిశారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.. ఈ రకంగా దూరమైన సామాజిక వర్గాలను దగ్గరకు తీసుకోవడం, క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపేందుకు జగన్మోహన్ రెడ్డి జైలులో ఉన్న వారితో భేటీ అవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news