పుంగనూరు అల్లర్లకు చంద్రబాబే కారణం – అంబటి రాంబాబు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. శనివారం సత్తెనపల్లి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరు అల్లర్లకు చంద్రబాబే కారణమని విమర్శించారు. ఆయన తప్పు చేసి సమర్ధించుకుంటున్నాడని మండిపడ్డారు. పుంగనూరులో హింసను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు.

పోలీసులు పుంగనూరు రావద్దని చంద్రబాబుకు చెబితే మొదట అంగీకరించారని.. ఆ తర్వాత బైపాస్ గుండా వెళ్లకుండా మళ్ళీ ఎందుకు పుంగనూరు ఊర్లోకి వచ్చారని ప్రశ్నించారు. పుంగనూరు వెళ్తానని చంద్రబాబు పట్టుబట్టడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు అడ్డుకున్నారని వెల్లడించారు. పోలీసులు అడ్డుకోవడం తోనే టిడిపి కార్యకర్తలు రాళ్లతో పోలీసులపై దాడి చేశారని మండిపడ్డారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే గొడవలు సృష్టించారని ఆరోపించారు. పోలీసులపై దాడి జరిగితే పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news