బీసీలపై బాబు పూర్ లవ్ కి ప్రూఫ్ ఇదిగో!

బాబు మారతారని 2019 ఎన్నికల ఫలితాల రూపంలో ప్రజల అభిప్రాయాలు గ్రహించారని.. ప్రజలు తెలివైన వారని బాబు అర్ధం చేసుకున్నారని తమ్ముళ్లంతా అనుకున్నారు! కానీ… బాబు మారలేదు.. మారతారనే నమ్మకమూ లేదని స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు కొందరు తమ్ముళ్లు! అందుకు వారు చూపిస్తున్న కారణం… తాజాగా బాబు ప్రకటించిన పదవుల్లో బీసీలపై ప్రేమ!!


తాజాగా ప్రకటించిన పార్టీ పదవుల్లో బీసీలకు 41శాతం, ఎస్సీలకు 11 శాతం, మైనార్టీలకు 6శాతం, ఎస్టీలకు 3శాతం పదవుల చొప్పున మొత్తంగా 61శాతం పదవులు వారికే ఇచ్చామని చంద్రబాబు ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే వీటిలో కూడా బాబు దొంగ ప్రేమే చూపించారనేది ఆ వర్గం నేతల విమర్శగా ఉంది!

కాస్తో కూస్తో విలువున్న ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, నాలెడ్జి కమిటీ, కోశాధికారి వంటి పదవులు మాత్రం వారి సామాజిక వర్గాల వారికి అప్పగించి…ఏమాత్రం ప్రయోజనం లేని ఆర్గనైజింగ్‌ కార్యదర్శులు, కార్యదర్శుల పదవులు అంటూ చెప్పి వాటిని మాత్రం బీసీలకు ఎస్సీలకు అధికంగా ఇచ్చి.. వారిపై మళ్లీ దొంగ ప్రేమ చూపించారంట! ప్రస్తుతం టీడీపీలో ఇదే హాట్ టాపిక్ గా మారుతుంది!

అధికారప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు వంటి కీలక పదవుల్లో ఒక్క గిరిజనుడికి కూడా చోటు కల్పించని ప్రేమ బాబు సొంతమని… బీసీలకు ఇలాంటి చిన్న చిన్న పదవులు ఇచ్చి.. బాబు దృష్టిలో వారి స్థానం తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేశారని.. పార్టీ ఉన్న ఈ పరిస్థితుల్లో బాబు ఇంకా ఇలానే ఆలోచిస్తే… జనాలు అమాయకులు కాదని.. ఈసారి ఇవి కూడా ఉండవని చెవులు కొరుక్కోవడం కొసమెరుపు!!