Breaking : నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్

-

టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలోని ఆర్‌.కె.ఫంక్షన్‌ హాల్‌ వద్ద  చంద్రబాబు బస చేసిన బస్సు నుంచి కిందికి రావడంతో పోలీసులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన హక్కులను ఎందుకు ఉల్లంఘిస్తున్నారని చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. తాను తప్పు చేస్తే నడిరోడ్డులో ఉరేయండి అని అన్నారు. ఏ చట్టప్రకారం నన్ను అరెస్టు చేస్తారు ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని నిలదీశారు.

అయితే హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని పోలీసులు తెలిపారు. మరోవైపు చంద్రబాబు తరఫున న్యాయవాదులు పోలీసులతో వాదిస్తున్నారు. ఆధారాలు చూపించాలని అడిగారు. రిమాండ్‌ రిపోర్టులో అన్నీ ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ ఇస్తామన్నారు. అయితే ప్రాథమిక ఆధారాలు చూపించాల్సిందేనని న్యాయవాదులు పట్టుబట్టారు. చుట్టుముట్టి బెదిరించడం సరికాదని ఈ సందర్భంగా పోలీసులు అన్నారు. చెదిరించట్లేదని, తమ హక్కులు అడుగుతున్నామని చంద్రబాబు అన్నారు. చంద్రబాబును అదుపులోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని న్యాయవాదులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news