ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4 గురు రైతులు బలవన్మరణం చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఒక్క రోజులో నలుగురు అన్నదాతల ఆత్మహత్యలా? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగ సంక్షోభం – ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటనకు వెళ్లినా రైతు కష్టాలు, రైతాంగ సమస్యలు కనిపిస్తున్నాయని.. నిన్న ఒక్క రోజే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4 గురు రైతులు బలవన్మరణాలు పొందడంపై తీవ్ర ఆవేదన కలిగిస్తోందని ఫైర్ అయ్యారు.
ఒక్క రోజులో ఒక్క జిల్లాలో నలుగురు రైతన్నలు ప్రాణాలు తీసుకున్నారని… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని మండిపడ్డారు. రైతు సమస్యలపై ప్రభుత్వ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని..సాగుకు సబ్సిడీలు, పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతుకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. ఒక్క రోజులో నలుగురు అన్నదాతలను కోల్పోయిన పరిస్థితిని ప్రభుత్వం అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించాలని… ప్రభుత్వం తన నిర్ణయాలు, చర్యల ద్వారా రైతులు, కౌలు రైతులకు అండగా నిలవాలని కోరారు చంద్రబాబు.