నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముగించుకుని తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ నుంచి యువగళం పాదయాత్ర కొనసాగింది. మొదట విజయవాడ వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల్లో పాదయాత్ర నడిచింది. అయితే పాదయాత్రలో కృష్ణా జిల్లా తమ్ముళ్ళు దాదాపు పాల్గొన్నారు.
బెజవాడకు సంబంధించి..బోండా ఉమా, దేవినేని ఉమా, నెట్టెం రఘురాం, గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న ఇలా పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక పాదయాత్రని కేశినేని శివనాథ్ పర్యవేక్షిస్తున్నా విషయం తెలిసిందే. ఇటు వంగవీటి రాధా సైతం లోకేష్ కు స్వాగతం పలికి..పాదయాత్రలో పాల్గొన్నారు. ఇలా అంతా పాదయాత్రలో పాల్గొన్నారు..కానీ విజయవాడ ఎంపీ కేశినేని నాని మాత్రం రాలేదు. అయితే మొదట నుంచి కేశినేని టిడిపిలో దూరంగానే ఉంటున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి టిడిపిపైనే ఆయన విమర్శలు చేస్తున్నారు. బుద్దా, బోండాలతో కేశినేనికి పడటం లేదు.
అటు వైసీపీ ఎమ్మెల్యేలతో కేశినేని సఖ్యతగా ఉంటున్నారు. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర విజయవాడలో ఎంట్రీ ఇచ్చిన ఆయన కనబడలేదు. కనీసం ఆయన కుమార్తె శ్వేత కూడా పాదయాత్రలో లేరు. అయితే కావాలని కేశినేని దూరం జరిగారు..ఆయన సోదరుడు చిన్ని అధ్వర్యంలో పాదయాత్ర నడుస్తున్న నేపథ్యంలో నాని రాలేదా? అనే డౌట్ వస్తుంది.
పైగా నెక్స్ట్ విజయవాడ ఎంపీ సీటు కేశినేని చిన్నికి అని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేశినేని నాని టిడిపికి దూరం జరుగుతున్నారా? అనే డౌట్ వస్తుంది. చూడాలి మరి టిడిపిలో కేశినేని వ్యవహారం ఎంత దూరం వెళుతుందో.