బాబు టీంలో ఆ ఇద్దరు ఫైర్‌బ్రాండ్స్‌కు ఛాన్స్ వెన‌క ఇంత క‌థ ఉందా..!

-

తెలుగుదేశం పార్టీలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన ఏడాదిన్నర తర్వాత చంద్రబాబు, టీడీపీని ప్రక్షాళన చేశారు. పార్టీలో కీలక పదవులని భర్తీ చేశారు. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులు, సమన్వయకర్తలని నియమించారు. అలాగే మహిళా అధ్యక్షులని సైతం నియమించారు. ఇక తాజాగా పొలిట్‌బ్యూరోలో కీలక మార్పులు తీసుకొచ్చారు. పాతవారితో పాటు మరికొందరిని పొలిట్‌బ్యూరోలో తీసుకున్నారు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శులని, ఉపాధ్యక్షులని, అధికార ప్రతినిధులని నియమించారు. ఇక పలు కీలక పదవులని భర్తీ చేశారు.

అయితే టీడీపీలో అత్యున్నత స్థానంగా భావించే పొలిట్‌బ్యూరోలో బాబు ఓ ఇద్దరు ముక్కుసూటిగా మాట్లాడే సీనియర్ నేతలని పెట్టారు. ఊహించని విధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరీ, చింతకాయల అయ్యన్నపాత్రుడులని పొలిట్‌బ్యూరోలో తీసుకున్నారు. మామూలుగా ఈ ఇద్దరు నేతలు ఏ విషయన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మొహం మీద చెప్పేస్తారు. సాధారణంగా ఏ నాయకుడైన తమ అధినేతకు ఎదురు చెప్పడం ఎందుకని, ఆయనకు పార్టీ గురించి అన్నీ పాజిటివ్ విషయాలే చెప్పాలని చూస్తారు. అలాగే కొంచెం భజన కూడా చేస్తుంటారు.

దీంతో అధినేతకు గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతుందో తెలియదు. అంతా బాగుందనే అనుకుంటారు. దాని వల్ల పార్టీకి ఎంత డ్యామేజ్ అవుతుందో 2019 ఎన్నికలే ఉదాహరణ. అయితే అలా కాకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి తప్పులున్న అధినేత మొహం మీదే చెప్పగలిగే కెపాసిటీ నాయకులు అయ్యన్న, బుచ్చయ్య. వీరు ఏ విషయం ఉన్న మొహమాట పడరు.

డైరక్ట్‌గా అధినేత ముందే కుండబద్దలు కొట్టేస్తారు. అవసరమైతే అధినేత తప్పు చేస్తున్నా కూడా, డైరక్ట్‌గా ఆయనకే చెప్పేస్తారు. కాబట్టి ఇలాంటి వారు పొలిట్‌బ్యూరోలో ఉండటం వల్ల పార్టీకి మంచి జరుగుతుందనే అభిప్రాయం కేడర్‌లో ఉంది. కింది స్థాయిలో పార్టీలో ఎలాంటి లోపాలున్న వాటిని సరి చేసుకునే అవకాశం దక్కుతుంది.

 

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news