వచ్చే ఏడాదిలో భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు తమ ఆటగాళ్లకు వీసాలు ఇవ్వాలని భారత్‌ను కోరింది పాక్ క్రికెట్ బోర్డ్..పాకిస్థాన్ ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందికి వీసాలపై హామీ ఇవ్వాలని పాక్ క్రికెట్ బోర్డు కోరింది. 2021 అక్టోబర్‌లో భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌లో పాల్గొ నేందుకు తమకు వీసాల మంజూరుపై హామీ ఇవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కార్యనిర్వాహణ అధికారి వసీం ఖాన్ ఐసీసీని కోరారు..
ఉద్రికత్తల నడుమ ద్వైపాక్షిక సిరీస్ ఉంటుందని ఆశించడం లేదన్న వసీంఖాన్..ప్రపంచకప్ అనేది ఐసీసీకి సంబంధించిన విషయమన్నారు..ఐసీసీ నిబంధనల ప్రకారం టోర్నీకి ఆతిథ్యమిచ్చే దేశం ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లన్నింటికీ అన్ని రకాల వసతులు కల్పించాల్సి ఉంటుందని గుర్తు చేశాడు. తమ ఆటగాళ్లకు వీసాల అందేలా ఐసీసీ హామీ ఇస్తుందని భావిస్తున్నామన్నాడు ఐసీసీ కలగజేసుకొని భారత ప్రభుత్వంతో మాట్లాడాలని కోరినట్లు తెలిపారు.