పోలవరం నిర్వాసితులకు చంద్రబాబు నాయుడు అదిరిపోయే శుభవార్త చెప్పారు. అతి త్వరలోనే పోలవరం నిర్వాసితులకు ఆర్థిక సహాయం అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది. వాళ్లందరికీ వీలైనంత త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన నష్టపరిహారం అందేలా చూస్తామని వెల్లడించారు. నిర్వాసితులకు 10 లక్షలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పి మోసం చేశాడని… ఫైర్ అయ్యారు చంద్రబాబు.
ఇవాళ పోలవరం పర్యటనకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ ఏరియల్ సర్వే కూడా చేశారు సీఎం చంద్రబాబు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మెరుగైన పరిహారం అందిస్తామని ప్రకటించారు. తాజాగా 800 కోట్లకు పైగా పరిహారం ఖాతాల్లో జమ చేశామన్నారు. అధికారంలో ఉన్న లేదా ప్రతిపక్షంలో ఉన్న విపత్తుల సమయంలో నిర్వాసితులను మేము ఆదుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.