ఇవాళ ముంబయి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ కెబినెట్ అనంతరం ముంబయి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ఏపి సిఎం చంద్రబాబు,మంత్రి నారా లోకేష్..ఇద్దరూ ముంబయి వెళ్లనున్నారు. రతన్ టాటా మృతికి నివాళులర్పించనున్న ఏపీ కెబినెట్..సంతాపం తెలపనుంది. అటు ముంబైకి వెళ్లి.. ఏపి సిఎం చంద్రబాబు,మంత్రి నారా లోకేష్.. సంతాపం తెలుపుతారు.
అటు ఇప్పటికే రతన్ టాటా మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు అన్నారు. రతన్ టాటా.బిజినెస్ టైకూన్ మాత్రమే కాదు.. గొప్ప మానవతావాదని తెలిపారు.
దార్శనికత.. చిత్తశుద్ధితో రతన్ టాటా ఈ ప్రపంచంపై చిరస్థాయిగా ముద్ర వేశారని వెల్లడించారు. పారిశ్రామిక రంగం, దాతృత్వం వంటి అంశాల్లో రతన్ టాటా భావి తరాలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. దేశ నిర్మాణానికి రతన్ టాటా విశేషమైన సేవలందించారని తెలిపారు చంద్రబాబు. ఎలా జీవించాలోననే అంశం రతన్ టాటా జీవితమే ఓ ఐకాన్…. నా స్నేహితుడ్ని, మిస్ అయ్యాను అని తెలిపారు.