ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 16 ఇవ్వాళ జరగనున్న RBI వేలం లో స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ స్టాక్స్ ని వేలం వేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్లు అప్పు తీసుకోవడానికి సిద్ధం అయ్యింది. ఒక్క జూలై లోనే RBI నుండి సెక్యూరిటీ బాండ్స్ రూపం లో ఏపీ సర్కార్ 9,000 కోట్లు రుణంగా తీసుకుంది.
అటు ఏపీ కేబినెట్ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్, ఇసుక విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినేట్. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానానికి కెబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను రూపొందించనుంది చంద్రబాబు ప్రభుత్వం.
పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ. 3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషనుకు ప్రభుత్వ గ్యారెంటీకి కెబినెట్ ఆమోదం తెలిపింది.