రైతుల కంట నీరు రాష్ట్రానికి మంచిది కాదు : ఎంపీ ఈటల రాజేందర్

-

విశ్వసనీయత లేనందుకే ప్రజలు బీఆర్ఎస్ కి బుద్ది చెప్పారు ప్రజలు అని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తాజాగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఎలాంటి షరతులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. రైతుల కంట నీరు రాష్ట్రానికి అంత మంచిది కాదు అన్నారు. రాష్ట్రంలో పదేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు.

రేవంత్ రెడ్డి రైతుల గురించి ఎన్నికల ముందు మాట్లాడారు. డిసెంబర్ 09లోపు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఎన్నికల తరువాత యాదగిరి లక్ష్మీనరసింహారెడ్డి, భద్రాచలం శ్రీ సీతారాముల స్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి, వేములవాడ రాజరాజేశ్వర వంటి దేవుళ్ల పై కూడా ప్రమాణం చేశారు. కానీ ఇప్పుడు కేవలం కొంత మంది రైతులకు మాత్రమే లబ్దిపొందేలా చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. రేషన్ కార్డు తప్పనిసరి అంటున్నారు. రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news