గుడివాడ టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయంపై దాడి కేసుల వెలికితీసేందుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనరాదని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు అధికారంలో ఉండగా ఫోన్ చేసి వైకాపా నేతల బెదిరింపులకు పాల్పడ్డారట. 2022, డిసెంబరు 25న తెదేపా కార్యాలయంలో ఉన్న రావి, ఇతర టీడీపీ నేతలపైన కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడులకు తెగబడ్డారట వైకాపా నేతలు.
ఈ ఘటనలో వైకాపా నాయకులకు పూర్తిగా కొమ్ము కాసి, టిడిపి నేతలపైనే తప్పుడు కేసులు నమోదు చేశారట అప్పటి సీఐ గోవిందరాజులు. అలాగే, కొడాలి నాని క్యాసినో వ్యవహారంపై 2022, జనవరి 21న గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ నేతలపై దాడులు చేసినట్లు సమాచారం. కార్లు ధ్వంసం, గుడివాడ టిడిపి కార్యాలయంపై దాడి జరిగినా ఫర్నిచర్ ధ్వంసం ఘటనలలో చర్యలు తీసుకోలేదట అప్పటి పోలీసులు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టిడిపి నేతలపైనే కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనలో వైకాపా సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్ , కొడాలి నాని అనుచరులపై కేసులు నమోదుకు రంగం సిద్ధం చేసుకున్నారట పోలీసులు.