160 దేవాలయాలను పునర్నిర్మాణం చేయబోతున్నాం – ఏపీ మంత్రి ఆనం

-

160 దేవాలయాలను పునర్నిర్మాణం చేయబోతున్నామని… 13 వెనుకబడిన ప్రాంతాలు ట్రైబల్ ఏరియాలో ఉన్న గుళ్లనూ పునర్నిర్మాణం చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు మంత్రి ఆనం. భగవంతుని ఆస్తులకు రక్షకునిగా వుండాలని నాకు ఈ బాధ్యత ఇచ్చారని… గత ప్రభుత్వంలో తిరుమల నుంచి అరసవల్లి వరకు భూములు అన్యాక్రాంతం అయ్యాయని వెల్లడించారు. ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాం…సీఎం తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారని తెలిపారు మంత్రి ఆనం.

AP Minister Anam

ప్రజాగళం, యువగళంలలో వచ్చిన వినతులను పరిస్కరిస్తామని… రూ. 50 వేల కంటే తక్కువ ఉన్న దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాల నిమిత్తం రూ. 10 వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.దీనికి సంబంధించి రూ.32 కోట్లు అదనపు బారం దేవాదాయ శాఖపై పడుతుంది…తప్పులు చేసిన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో రెండు ఆలయాలలో తప్పులు జరిగినట్టు నిర్ధారించి 5 అధికారులను సస్పెండ్ చేశాం….దేవదాయ శాఖకు చెందిన ఓ అధికారిణిని సస్పెండ్ చేశామని గుర్తు చేశారు మంత్రి ఆనం.

Read more RELATED
Recommended to you

Latest news