చంద్రబాబుకు వెన్నుపోటు పితామహుడు అనే అవార్డు ఇవ్వాలి – మంత్రి కొట్టు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. మహానాడులో చంద్రబాబుకు హంతకరత్న, వెన్నుపోటు పితామహుడు అనే అవార్డులు ఇవ్వాలని తీర్మానం చేయాలని సెటైర్లు వేశారు. ప్రజల విశ్వాసం పొంది 9 నెలలకు తిరగకుండానే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, ఆయనపై చెప్పులు వేయించిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు. అలాంటి వ్యక్తి నేడు ఎన్టీఆర్ కి పాదపూజ చేస్తా, శతజయంతి చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు.

అలాంటి నీచ రాజకీయాలను సహించలేక ప్రజలు చంద్రబాబుని రాజకీయ సమాధి చేశారని ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇదేం కర్మ అనే పేరుతో 13 మందిని, గోదావరి పుష్కరాలలో 33 మందిని పొట్టన పెట్టుకున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ అదే చంద్రబాబు రాజమండ్రిలో మహానాడు పెట్టి ఇంకెంత మందిని పొట్టన పెట్టుకుంటాడు అని జనం భయపడుతున్నారని సెటైర్లు వేశారు. తుని ఘటనలో రత్నాచల్ రైలు తగలబెట్టింది చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ జనాల ప్రాణాలు పోతున్నాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news