కార్యకర్తలను ఇంకా నమ్ముతున్న బాబు.. కొత్త పిలుపు!

-

ఏమాటకామాట చెప్పుకోవాలంటే… చంద్రబాబు ను కార్యకర్తలు అస్సలు అర్ధం చేసుకోవడం లేదు. ఆయన ఆలోచనలనూ అర్ధం చేసుకోవడం లేదు, ఆయన భయాన్నీ అర్ధం చేసుకోవడం లేదు, ఆయన వయసునూ అర్ధం చేసుకోవడం లేదు. అయినా కూడా ఒకసారి కాకపోతే మరోసారైనా అర్ధం చేసుకుంటారులే అని చంద్రబాబు.. టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు!

అవును… కార్యకర్తలు చంద్రబాబుని నమ్మకపోయినా.. చంద్రబాబు మాత్రం కార్యకర్తలను నమ్ముతూనే ఉన్నారు! వారు వినడం లేదని తెలిసినా.. వినరని అర్ధం అయినా.. ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు! అందులో భాగంగా తాజాగా… రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు టీడీపీ నేతలు, కార్యకర్తలు అండగా నిలవాలని కోరుతున్నారు చంద్రబాబు!

అయితే.. ఇలా కార్యకర్తలను, నేతలను కోరడం బాబుకు కొత్త కాదు.. వినకపోవడం కార్యకర్తలకు నేతలకూ కొత్త కాదు! కరోనా సమయంలో రాష్ట్రం విడిచి బయటున్న బాబు.. ఏపీలో కార్యకర్తలకు సహాయ కార్యకరమాలు చేయాలని సూచించారు. అయినా బాబు మాట విన్న నాథుడు లేడు! ఇదే సమయంలో.. అమరావతి ఉద్యమానికి సంఘీబావాలు తెలపాలని, రాష్ట్రమంతా చేయాలని కోరారు.. అయినా స్పందించిన కార్యకర్తా లేడు, నాయకుడూ లేడు!

అయినా కూడా ఆదేశించడంలో అలుపెరగని బాబు… తన పంథాను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు!! పోని బాబు ఇంకా గట్టిగా మాట్లాడదామంటే… ముందు మీరు రండి అని అంటారేమోనని భయం!! పాపం.. బాబు!!

Read more RELATED
Recommended to you

Latest news