టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన బుధవారం రోజున రాజమహేంద్రవరం కారాగారం నుంచి ర్యాలీగా వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. తన కుటుంబ సభ్యులను కలిసిన అనంతరం.. అభిమానులతో మాట్లాడారు. చంద్రబాబు అలిసి పోవటంతో ఇవాళ ఎవరినీ కలవకుండా విశ్రాంతి తీసుకోనున్నారు.
మరోవైపు ఇవాళ చంద్రబాబు సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్‌కు రానున్నారు. ఏఐజీ, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోనున్నారు. ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల చికిత్స కోసమే ఆయనకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదట తన ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్‌కు వచ్చి వైద్యులను కలవనున్నారు.
52 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే ఆయణ్ను చూసేందుకు లక్షల మంది అభిమానులు తరలి వచ్చారు. చంద్రబాబు కాన్వాయ్‌కు ఎదురెళ్లి విక్టరీ సింబల్ చూపిస్తూ సంబురాలు చేసుకున్నారు. వారందికీ అభివాదం చేస్తూ చంద్రబాబు వాహన శ్రేణి ముందుకు సాగింది.